విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎఫ్3’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రూ.50 కోట్ల షేర్ మార్క్ కు దగ్గరగా ఉన్న ఈ మూవీ గురించి తాజాగా ఓ సడెన్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటి అంటే ‘ఎఫ్3’ చిత్రం 8 వారాల వరకు ఓటీటీలో రిలీజ్ కాదట. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరోలు వెంకీ, వరుణ్.. దర్శకుడు అనిల్ రావిపూడి లు ఓ వీడియోను చేశారు.
‘ఎఫ్3’ రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి కావస్తున్నా.. ఇప్పటివరకు చెయ్యని అనౌన్స్మెంట్ ఇప్పుడెందుకు చేస్తున్నారు? అనే డౌట్ అందరికీ రావచ్చు. అందుకు కారణం లేకపోలేదు. కొద్దిసేపటి క్రితం.. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంట్ పద్ధతిలో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే ఇలా ఓటీటీలో అది కూడా రెంట్ పద్ధతిలో రిలీజ్ చేయడంతో.. ‘ఎఫ్3’ కూడా ఇలాగే ఓటిటికి వచ్చేస్తుంది అని ప్రేక్షకులు డిసైడ్ అయ్యే ప్రమాదం ఉంది.
అందులోనూ ఈ వారం రెండు కొత్త క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలకు టికెట్ రేట్లు మరింత తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాకే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ‘ఎఫ్3’ యూనిట్లో టెన్షన్ మొదలైంది. అందుకే హీరోలు, దర్శకుడితో ఇలా సడెన్ అనౌన్స్మెంట్ ఇప్పించారు ‘ఎఫ్3’ మేకర్స్. అయితే .. 8 వారాల వరకు ఈ సినిమాని దాచే ప్రయత్నం నిర్మాత దిల్ రాజు చేయరని.. మరో రెండు వారాల్లో ఓటీటీకి వచ్చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.