నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు.. వేరే ఆప్షన్ లేదా?

  • July 8, 2021 / 05:24 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 9 నెలల వరకు అవి తెరుచుకోలేదు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటిలను నమ్ముకున్నారు. వాటికి డిమాండ్ పెరిగింది. సబ్స్క్రిప్షన్లు కూడా పెరిగాయి. జనాలను మరింతగా ఆకర్షించాలని ‘ఆహా’ ‘అమెజాన్ ప్రైమ్’ ‘నెట్ ఫ్లిక్స్’ వంటి సంస్థలు కొత్త సినిమాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. దీనితో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిట్లర్లకు కొత్త భయం పట్టుకుంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత అసలు జనాలు వస్తారా? అని..! వాళ్ళ అనుమానాలు పటాపంచలు చేస్తూ జనాలు థియేటర్లకు తరలివచ్చారు.

4 నెలల వరకు అంతా బాగానే నడిచింది. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ లాక్ డౌన్ పడడంతో మళ్ళీ ఓటిటిలు పుంజుకున్నాయి. ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. జనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రెండో దశలో కరోనా భయంకరంగా విజృంభించింది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంటున్నారు కాబట్టి.. జనాల్లో మరింత ఆందోళన పెరిగింది. కాబట్టి కొత్త సినిమాలు రిలీజ్ అయితే జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా ఆశాజనకంగా లేదని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బయ్యర్లు మునుపటిలా ఎక్కువ రేట్లు పెట్టి సినిమాని కొనుగోలు చేయలేరని తేలిపోయింది. నితిన్ ‘మాస్ట్రో’ సినిమాకి రూ.13కోట్లకి మించి థియేట్రికల్ బిజినెస్ కావడం లేదని ప్రచారం జరిగింది. నిజానికి నితిన్ సినిమాలకు రూ.22 కోట్ల నుండీ రూ.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు సగానికి సగం అన్నట్టు ఉంది కాబట్టే అతను ఓటిటిని ఆశ్రయించి రూ.32 కోట్లకు అమ్మేశాడు. ‘నారప్ప’ ‘దృశ్యం2’ వంటి సినిమాల పరిస్థితి కూడా అంతే..! ఫైనల్ గా.. అటు నిర్మాత నష్టపోకూడదు.. ఇప్పుడు బయ్యర్లు, ఎగ్జిబిటర్ల భవిష్యత్తు నాశనమైపోకూడదు. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ మేటర్. దీనికి ప్రత్యామ్న్యాయం ఏంటి అన్నది.. ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus