ఈ మధ్య కాలంలో కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ భావించిన సినిమాలలో ఆచార్య సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అయితే అంచనాలను అందుకోలేకపోవడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. మిర్చి నుంచి భరత్ అనే నేను సినిమా వరకు వరుస విజయాలను అందుకున్న కొరటాల శివ ఆచార్య సినిమాను హిట్ చేయడంలో ఎందుకు తడబడ్డారనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది. అయితే ఆచార్య కథ వెనుక జరిగిన తప్పులే ఈ సినిమా ఫ్లాప్ కు కారణమయ్యాయని అంగీకరించాల్సిన విషయమని చెప్పవచ్చు.
దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టక ముందే కొరటాల శివ తొమ్మిది స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకున్నారు. అలా సిద్ధం చేసుకున్న ఒక కథతో కొరటాల శివ రామ్ చరణ్ ను కలిసి కథ చెప్పి ఒప్పించారు. రామ్ చరణ్ కూడా కొరటాల శివ డైరెక్షన్ లో నటించాలని భావించినా అదే సమయంలో ఆర్ఆర్ఆర్ లో ఛాన్స్ రావడంతో వెనక్కు తగ్గారు. మంచి కథ ఉంటే చిరంజీవితో సినిమాను తెరకెక్కించాలని చరణ్ సూచించగా కొరటాల శివ తక్కువ సమయంలోనే కొత్త కథను తయారు చేయడంతో ఆచార్య కథ, కథనం విషయంలో పొరపాట్లు జరిగాయి.
కథ సిద్ధమై షూట్ మొదలైన తర్వాత కాజల్ రోల్ ను తొలగించడం, చరణ్ పాత్ర నిడివి విషయంలో మార్పులు చేయడం కూడా ఆచార్య రిజల్ట్ పై ప్రభావం చూపాయి. ఆచార్య సినిమా రీషూట్లకు సంబంధించిన వార్తలు సైతం సినిమాపై నెగిటివ్ అభిప్రాయాన్ని కలగజేశాయి. ఆచార్య స్క్రిప్ట్ కోసం కొరటాల శివ మరింత సమయం కేటాయించి ముందడుగులు వేసి ఉంటే మాత్రం ఆచార్య రిజల్ట్ ఇంత దారుణంగా ఉండేది కాదని మరి కొందరు భావిస్తున్నారు.
క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడం కూడా ఆచార్య మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. మెగా మల్టీస్టారర్ గా కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందని మెగా ఫ్యాన్స్ సైతం కలలో కూడా భావించలేదు.