ఫహాద్ ‘పుష్ప’ లో విలన్. పార్ట్ 1 లో అతని పాత్ర క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తుంది. సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచడానికి ఫహాద్ పాత్ర బాగా ఉపయోగపడింది. అంతేకాదు సెకండ్ పార్ట్ కథ మొత్తం ఫహాద్ (Fahadh Faasil) పాత్ర చుట్టూనే తిరుగుతుందని ఇన్సైడ్ టాక్. కాబట్టి.. ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) కి ఫహాద్ కాల్షీట్స్ బాగా కీలకం. జనవరి, ఫిబ్రవరి టైంలో ఫహద్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.అందుకోసం ఫహాద్ కాల్షీట్స్ ముందుగానే ‘పుష్ప’ టీం బ్లాక్ చేసింది.
ఫహాద్ కూడా టీంకి సహకరిస్తూ మరో కమిట్మెంట్ పెట్టుకోలేదు. కానీ ఆ టైంలో సుకుమార్ (Sukumar) షూటింగ్ ప్లానింగ్ మొత్తం మార్చేశాడు. దీంతో ఫహాద్ డేట్లు వేస్ట్ అయిపోయాయి. ఆ తర్వాత ఫహాద్ బిజీగా ఉన్న టైంలో డేట్లు కావాలని సుకుమార్ అండ్ టీం అడిగారట. దానికి అతను చాలా కోప్పడినట్టు తెలుస్తుంది. ‘పుష్ప 2 ‘ కోసం కేటాయించిన డేట్లు అతనికి వేస్ట్ అయిపోయాయి. ఆ టైంలో మరో సినిమా అతను చేసింది లేదట.
‘పుష్ప’ టీం కనుక ముందుగా ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసి ఉంటే.. ఫహాద్ ప్లాన్ ఛేంజ్ చేసుకునేవాడు. అందువల్ల అతనికి కూడా కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు.. ‘పుష్ప’ టీంకి అతను చివాట్లు పెట్టినట్లు తెలుస్తుంది. సరే నిర్మాతలు, దర్శకుడు బ్రతిమాలడంతో కొత్త డేట్లు ఇచ్చాడు. కానీ అది వారు కోరుకున్న టైంకి కాదు.
మధ్యలో అతను కమిట్ అయిన కొన్ని ప్రాజెక్టులను ముందుగా ఫినిష్ చేసి.. తర్వాత ‘పుష్ప 2 ‘ కి డేట్స్ కేటాయించాడట. ఇప్పుడు రిలీజ్ ఆలస్యమవుతుంది. 4 నెలలు ఆలస్యమవుతుంది కాబట్టి.. నిర్మాతలకి రూ.32 కోట్ల వరకు డ్యామేజ్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్.