మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘పుష్ప’ (Pushpa) ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో ఇతను తెలుగులో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని లేటెస్ట్ మూవీ ‘ఆవేశం’ ని మలయాళం రాకపోయినా తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు అంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇతని ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంది అనేది. ఇదిలా ఉండగా…ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కేరళలోని ఒక చిల్డ్రన్ రీ హాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా ఫహద్ ఫాజిల్ హాజరయ్యాడు.
తర్వాత అతను స్పీచ్ ఇస్తున్న టైంలో.. తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అతను కూడా ఏడీహెచ్‌డీ అనే వ్యాధి బారిన పడినట్టు అతను చెప్పుకొచ్చాడు. ‘ఏడీహెచ్‌డీ’ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని తెలుస్తుంది.ఈ వ్యాధి వల్ల ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదట. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ వంటివి కూడా ఉంటాయట. అందువల్ల వారే క్రియేటివ్‌గా ఉండాలని భావిస్తూ…
సైకలాజికల్‌గా ఎంతో ఒత్తిడికి గురవుతారట. ఇది వారికి పెద్ద సమస్యగా మారుతుంటుందట. 41 ఏళ్ల వయసులో ఫహాద్ ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్టు తెలిపాడు. చిన్న వయసులో ఈ వ్యాధి ఉందని తెలిస్తే.. క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదట. జీవితాంతం ఈ వ్యాధితో అతను సఫర్ అవుతూ ఉండాల్సిందేనట.