బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అంతేకాదు, వీళ్లకి సరదా టాస్క్ లు ఇచ్చి బిగ్ బాస్ కూడా కాసేపు కాలక్షేపం చేశాడు. ఈ టాస్క్ లలో భాగంగానే సన్నీకి ఇంకా సిరికి పెద్ద యుద్ధమే జరిగింది. ఆవేశంగా గొంతు చించుకుని మరీ సిరి బరెస్ట్ అయ్యింది. సన్నీ కూల్ గా నవ్వుతున్నా కూడా రెచ్చిపోయింది సిరి. ఇక బిగ్ బాస్ చాలా సీరియస్ గా అందర్నీ సూట్ కేసులు ప్యాక్ చేస్కోమని చెప్పాడు. ఇది వినగానే హౌస్ మేట్స్ కి సిట్యువేషన్ అర్ధమైంది.
ఇక్కడే బిగ్ బాస్ మీలో ఒకరి ప్రయాణం ఇక్కడే ముగిసిపోతుందని ఒకరు ఎలిమినేట్ అవ్వాలని చెప్పాడు. దీనికోసం ఎవర్ని ఇంటి నుంచీ బయటకి పంపాలని అనుకుంటున్నారో చెప్పమని హౌస్ మేట్స్ ని అడిగాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. సన్నీ, మానస్ ఇద్దరూ షణ్ముక్ పేరు చెప్పారు. దీంతో షణ్ముక్ కి రెండు ఓట్లు పడ్డాయి. కానీ, బిగ్ బాస్ మాత్రం సిరిని ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు. ఇక మిగతా హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు.షణ్ముక్ కి ఓట్లు ఎక్కువ వస్తే సిరిని ఎందుకు వెళ్లమన్నారు.
ఇది ఏదో మతలబు ఉంది అని, సన్నీ నువ్వు ఎలిమినేట్ అవ్వవు అని క్లియర్ గా చెప్పాడు. మళ్లీ వస్తావ్ అంటూ ధైర్యం చెప్పాడు. షణ్ముక్ అయితే ఇది నమ్మలేనట్లుగా కాసేపు అవాక్కై ఉండిపోయాడు. మైయిన్ గేట్ ఓపెన్ అయ్యి సిరి వెళ్లేలోపు షణ్ముక్ ని పట్టుకుని బాధపడింది. కన్నీళ్లతోనే సిరి ఇంటి నుంచీ బయటకి వచ్చింది. ఇక కళ్లకి గంతలు కట్టి తీసుకుని వెళ్లిన బిగ్ బాస్ టీమ్ సిరిని కన్ఫెషన్ రూమ్ లో వదిలారు. కళ్లకి గంతలు తీసిన తర్వాత సిరి ఇదేం ట్విస్ట్ బిగ్ బాస్ అంటూ అడిగింది.
కాసేపు అక్కడే కూర్చోమని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో గంటసేపటి తర్వాత బిగ్ బాస్ సిరిని తిరిగి హౌస్ లోకి పంపించాడు. ఇంత నాటకీయంగా అసలు ఈ ఎలిమినేషన్ ఎందుకు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సన్నీతో గొడవపడిన కారణంగానే సిరిని ఫేక్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ టీమ్ కూల్ చేసిందని, సిరి కి విషయాన్ని బిగ్ బాస్ టీమ్ క్లియర్ గా చెప్పేందుకే ఇలా చేశారని అంటున్నారు. మరోవైపు అసలు ఈ ఫేక్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సిరి ఆటతీరు సరిగ్గా లేదని, మైండ్ డిస్టర్బ్ అయిపోతున్న కారణంగానే ఇలా చేశారని బిగ్ బాస్ వ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా టాప్ 5లో పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు ఏ సీజన్ లో కూడా ఇలా ఫేక్ ఎలిమినేషన్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ సిరిని చేసి షణ్ముక్ ఎమోషన్స్ తో కాసేపు ఆడుకున్నట్లుగా అయ్యింది. మొత్తానికి అదీ మేటర్.