ఈమధ్యకాలంలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో హీరోల కాళ్లపై జనాలు పడడం అనేది కామన్ అయిపోయింది. అసలు వాడు స్టేజ్ మీదకి పరిగెట్టుకుంటూ వచ్చి మరీ హీరో కాళ్ళు పట్టుకొంటున్నాడో ఎవరికీ అర్ధం కాని విషయం. “అజ్ణాతవాసి” ఆడియో ఫంక్షన్ లో ఒక అభిమాని వచ్చి ఇలాగే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొన్నాడు. బౌన్సర్స్ అతడ్ని లాక్కెళ్లబోగా.. పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆపి ఆ కుర్రాడికి సెల్ఫీ ఇచ్చాడు. అప్పట్లో ఆ ఇన్సిడెంట్ ఒక సెన్సేషన్. పవన్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోల విషయంలో ఇలా కాళ్ళు పట్టుకొనే స్థాయి అభిమానం ఉంటుంది అంటే ఒకే కానీ.. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలెట్టిన విజయ్ దేవరకొండ & కెరీర్ మొత్తంలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని శర్వానంద్ లాంటి హీరోల కాళ్ళ మీద కూడా జనాలు పరిగెట్టుకుంటూ వచ్చి పడడం అనేది హాస్యాస్పదంగా మారింది.
విజయ్ దేవరకొండ కంటే శర్వానంద్ కాస్త మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడంతో అతడ్ని ఈ విషయంలో ట్రోల్ చేయలేదు నెటిజన్లు. అయితే.. నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో జరిగిన “కొబ్బరి మట్ట” ప్రీరిలీజ్ ఈవెంట్ లో సంపూర్ణేష్ బాబు స్పీచ్ ఇస్తుండగా.. ఒక వ్యక్తి విజయ్, శర్వా కాళ్ళ మీద పడినట్లే.. సంపూ కాళ్ళ మీద కూడా పడ్డాడు. తర్వాత సంపూ ఆ కుర్రాడ్ని పిలిచి “తమ్ముడు ఇందాక అలా నా కాళ్ళ మీద ఎందుకు పడ్డావ్?” అని ప్రశ్నించగా.. ఆ కుర్రాడు సింపుల్ గా “ప్రొడ్యూసర్ అలా చేయమన్నాడు” అని చెప్పడంతో ఈవెంట్ లో జనాలందరూ ఒక్కసారిగా ఘోల్లుమన్నారు. ఇది నిర్మాత సాయిరాజేష్ ప్లాన్ చేసిన స్పూఫ్. శర్వానంద్ కి కాకపోయినా విజయ్ దేవరకొండకు మాత్రం ఇది డైరెక్ట్ సెటైర్ లాంటిది. ఈ విషయమై “కొబ్బరి మట్ట” అండ్ టీం ను ఎవరూ డైరెక్ట్ గా ఏమీ అనలేరు కానీ.. నిన్నటి నుంచి ఆ ఇన్సిడెంట్ మాత్రం మంచి హైలైట్ గా మారింది.