ఫ్యాన్ వార్.. కాలం మారుతున్నా, మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా కానీ ఇప్పటికీ ఈ ఫ్యాన్ వార్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా వచ్చాక అభిమానుల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఇక్కడ మా హీరో గొప్ప అంటే మా వాడు గొప్ప అనే గోలే.. ఈ లిస్టులో సీనియర్ హీరోల నుంచి ఇప్పటి స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఉన్నారు.. మేమిద్దరం ఫ్రెండ్స్ అని బాలయ్య – చిరు.. మేమూ బాగానే ఉంటాం..
మారాల్సింది మీరే అని మహేష్ బాబు లాంటి యాక్టర్స్ చెప్పినా వీళ్లు మాత్రం అస్సలు మారరు.. పైగా కోలీవుడ్ హీరోల ఫ్యాన్స్‌ని కూడా టైం వచ్చినప్పుడు ఓ ఆట ఆడుకుంటున్నారు.. తెలుగు సినిమాకి ఆస్కార్ వచ్చినందనే ఆనందంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారుతో సామాజిక మాధ్యమాల ద్వారా తమ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటుంటే.. అభిమానం అనే ముసుగులో విషం చిమ్ముతున్నారు కొందరు దురాభిమానులు.. 2023 మార్చి 13 ప్రపంచ సినీ చరిత్రలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు..
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గర్వంతో తల పైకెత్తేలా చేసిన రోజు.. ఏళ్ల తరబడి నెలకొన్న నిరీక్షణకు తెర పడిన రోజు.. టాలీవుడ్‌కి ప్రపంచ సినీ దిగ్గజం హాలీవుడ్ సలాం కొట్టిన రోజు.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ గెలుచుకున్న రోజు.. కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం దీని కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసిందే.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది.. తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన అకాడమీ అవార్డు ‘నాటు నాటు’ పాటతో సాకారమైంది..
ఈ సందర్భంగా చిరంజీవి – బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెస్ కంటే వివాదాలకే తెర తీస్తున్నారు.. ఆస్కార్ సాధించిన సందర్భంగా కీరవాణికి, చంద్రబోస్‌కి, పాడిన వారికి, డ్యాన్స్ మాస్టర్‌కి, టీంకి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పలేదని మెగా ఫ్యాన్స్.. చిరంజీవి ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మీద సెటైర్స్ వేస్తూ నందమూరి అభిమానులు.. ఇలా ఆస్కార్ వచ్చిన ఆనందం కంటే కొట్లాటలే ఎక్కువ ఉన్నాయి..