యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ ప్రస్తుతం ఊహించని రేంజ్ లో ఉంది. తారక్ నటిస్తే ఆ సినిమాకు 200 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం ఖాయమని చెప్పవచ్చు. నవంబర్ నెల నుంచి తారక్ కొరటాల శివ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తారక్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు సెప్టెంబర్ నెల 2వ తేదీన బ్రహ్మాస్త్రం ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరు కానున్నారు. తారక్ ఈ ఈవెంట్ కు హాజరు కావడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం కాగా రెండోది తారక్ ఎంతగానో అభిమానించే నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం అని చెప్పవచ్చు. నాగార్జునను తారక్ ప్రేమగా బాబాయ్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.
తారక్ ఈవెంట్ కు రావడం గురించి నాగ్ స్పందిస్తూ సెప్టెంబర్ 2వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే విడుదలైన బ్రహ్మాస్త్రం ట్రైలర్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో జరగలేదు.
బ్రహ్మాస్త్రం ట్రైలర్ కు యూట్యూబ్ లో సైతం ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఎక్కువమందికి నమ్మకాలు లేవు. ఏ మాత్రం ఆకట్టుకోలేని గ్రాఫిక్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి సినిమా ఈవెంట్ కు తారక్ హాజరు కావడం ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. అయితే తారక్ హాజరవుతూ ఉండటంతో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమాపై కొంతమేర ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.