హీరోని మాస్‌గా చూపించాలంటే.. యాటిట్యూడ్‌ని ఛేంజ్ చేస్తుంటారు మన దర్శకులు. అయితే ప్రశాంత్ నీల్ స్టయిలే డిఫరెంట్ యాటిట్యూడ్‌తో పాటు ముఖానికి మసో, మట్టో పూసేస్తుంటాడు. ‘కేజీఎఫ్’ సినిమా చూశారు కదా. అందులో యశ్ పూర్తి ఫేస్ కనిపించేది చాలా తక్కువ సార్లే. అయితే ముఖం మట్టికొట్టకుపోయుంటుంది, లేదంటే జుట్టు కవర్ చేసేస్తుంది. అయితే వీటితోనే సినిమాలో ఎలివేషన్ సీన్స్ బాగా వచ్చాయంటుంటారు సినిమా నిపుణులు. ఇప్పుడు ‘సలార్’ విషయంలోనూ ప్రశాంత్ నీల్ అదే చేస్తున్నాడా? ఇప్పటివరకు విడుదలైన పోస్టర్ల ప్రకారం చూస్తే అలానే అనిపిస్తోంది.
‘సలార్’ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. దీని కోసం రూపొందించిన పోస్టర్‌లో ప్రభాస్‌కు బాగా మసి పూసేశారు. సినిమా నేపథ్యం చూస్తే… ఇందులో ప్రభాస్ బొగ్గు గనిలో పని చేసే కార్మికుడిగా పని చేస్తాడట. ఇంకా చెప్పాలంటే కార్మిక నాయకుడు అనుకోవచ్చు. అందుకే ముఖానికి మసి పూసేసి పోస్టర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమా నేపథ్యం చెప్పడానికో, ఫీల్ కోసమో ఇలా ‘మసి’ పోస్టర్లు రిలీజ్ చేయొచ్చు కానీ… సినిమా మొత్తం ప్రభాస్ ఇలానే ఉంటే కష్టమే మరి.
టాలీవుడ్‌లో హీరోలు ఎంత ఫైట్ చేసినా చొక్కాకు మట్టి అంటదు. ఎంత కష్టపడినా కాలర్‌కు చెమట అంటదు. ఇన్నాళ్లుగా అలా నడిపించేశాం. ఏమన్నా అంటే క్లాస్ స్టయిల్ అన్నాం. అప్పుడప్పుడు బురద ఫైట్లు గట్రా చేశాం కానీ… ఇలా ‘మసి’ ఫైట్లు చేయలేదు. మరి ప్రశాంత్ నీల్ ఈ స్టయిల్‌ను టాలీవుడ్‌లోకి తీసుకొస్తున్నాడు. ఈ లెక్కన అతని తర్వాత సినిమాలు కూడా ఇలానే ఉంటాయని టాక్ వినిపిస్తుంది. మరి మన హీరోల అభిమానులు ఊరుకుంటారంటారా…
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!