Devara: దేవర లీక్స్ విషయంలో ఫ్యాన్స్ ఫైర్ కావడానికి అసలు కారణాలివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. అయితే అధికారికంగా రావాల్సిన అప్ డేట్స్ అంతకంతకూ ఆలస్యం అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, వీడియోలు లీక్ అవుతుండటం ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తోంది. తాజాగా లీకైన పోస్టర్ ను సినిమాకు సంబంధించిన వాళ్లే లీక్ చేశారని పోస్టర్ ద్వారా క్లారిటీ వస్తోంది.

అయితే లీక్ చేస్తున్న వాళ్లపై మేకర్స్ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేకర్స్ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోతే ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉంది. అనధికారిక లీక్స్ వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుంచి మొదలుపెడతారో చూడాలి.

ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం రీచ్ అవ్వాలంటే ఒకింత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. దేవర మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ మార్చుకుంటూ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ లకు ఓటు వేస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ (Prashanth Neel) కాంబో మూవీ ఆగష్టులోనే మొదలు కానుందని వార్తలు వినిపించగా ఆ వార్తల్లో స్పష్టత రావాల్సి ఉంది. తారక్ తన సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్ తన సినిమాలతో ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus