రాజమౌళితో పోలిస్తే ఊరుకుంటారా..?

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాజమౌళి రేంజ్ ని మరింత పెంచింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీ చేత దర్శకుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడితో మరొకరిని పోల్చలేం. ఆ విషయాన్ని టాలీవుడ్ దర్శకులందరూ ఒప్పుకుంటారు. అయితే ఓ కుర్ర దర్శకుడిని రాజమౌళితో పోలుస్తూ..

జబర్దస్త్ కమెడియన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఏర్పాట్లు చేసి టీజర్ లాంచ్ చేశారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న కమెడియన్ గెటప్ శ్రీను ఒక స్పీచ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఇద్దరు రాజమౌళిలు ఉన్నారని.. ప్రశాంత్ వర్మను జక్కన్నతో పోల్చారు.

రాజమౌళిని చూసి స్ఫూర్తి పొందుతున్నట్లే ప్రశాంత్ వర్మను చూసి కూడా అలానే ఇన్స్పైర్ అవుతారని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ టాలెంట్ ఉన్న దర్శకుడే. అతడి ఫిల్మ్ మేకింగ్ ను జనాలు కూడా ఇష్టపడతారు. ‘హనుమాన్’ టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టి ఆయన్ను ప్రశంసించడంలో తప్పు లేదు. కానీ రాజమౌళితో ప్రశాంత్ వర్మను పోల్చడం జనాలు తట్టుకోలేకపోతున్నారు.

గెటప్ శ్రీను అలా కామెంట్స్ చేస్తున్నప్పుడు కనీసం ప్రశాంత్ వర్మ మైక్ తీసుకొని రాజమౌళి స్థాయికి తనింకా రాలేదని చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన అలా చేయలేదు. స్పీచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీంతో అతడిపై కొంతవరకు ట్రోలింగ్ జరిగింది. అవకాశాల కోసం కొందరు నటులు ఏదైనా మాట్లాడతారు కానీ రియాలిటీ తెలుసుకొని మాట్లాడితే అందరికీ మంచిది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus