Mahesh Babu: మహేష్ బర్త్ డే స్పెషల్.. మహేష్ పేరుతో నక్షత్రం రిజిస్టర్ చేసిన ఫ్యాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇలా మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల చేశారు అదేవిధంగా మహేష్ బాబు నటించిన బిజినెస్మెన్ సినిమాని కూడా రీ రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మహేష్ బాబు అన్ సీన్ పిక్స్ కూడా వైరల్ చేస్తున్నారు. ఇక అభిమాన హీరోల పుట్టినరోజులు అంటే ఫాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. మహేష్ బాబు అభిమానులు మాత్రం ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారని తెలుస్తుంది.మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ ఏకంగా ఆయన పేరిట ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేసి మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇవ్వడం గమనార్హం.

ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనకు ఇచ్చినటువంటి మైండ్ బ్లోయింగ్ బర్తడే గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా నక్షత్రాన్ని తన పేరుపై రిజిస్టర్ చేయడమే కాకుండా అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) పేరు పై రిజిస్టర్ చేసిన నక్షత్రానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. RA: 12h 33m 29s DEC: +69deg 47′ 17.6” కోఆర్డినేట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ నక్షత్రానికి ఆయన పేరుని రిజిస్టర్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus