టాలీవుడ్‌లో ఎక్కువ యాడ్స్‌లో నటించేది ఎవరు? యాడ్స్ నుండి ఎక్కువ డబ్బులు సంపాదించేది ఎవరు? ఆ లెక్కలు అయితే సరిగ్గా చెప్పలేం కానీ.. ఆ హీరో మాత్రమే మహేష్‌బాబునే అని చెప్పొచ్చు. ఇప్పుడు కాదు చాలా ఏళ్ల నుండి అండార్స్‌మెంట్‌లు భారీగానే సాగుతున్నాయి. అందుకునే మొత్తం కూడా భారీగానే ఉంటుందని టాక్. అయితే తాజాగా మహేష్ చేసిన ఓ యాడ్ / ప్రోమో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరైతే మహేష్.. ఇదేం బాలేదయ్యా అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?
‘పడమటి సంధ్యా రంగం’ పేరుతో ఇటీవల ఓ ప్రోమో యూట్యూబ్‌లో తిరుగుతోంది మీరు కూడా చూసే ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు, ఒకరు పాష్ అయితే, మరోకకు ఇండియన్ లోకల్. ఈ సీరియల్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన ప్రోమో అది. అందులో ఏముంది తప్పు అనుకుంటున్నారా? అందులో మహేష్‌బాబు కనిపించాడు అదే ఇక్కడ సమస్య. పెద్ద పెద్ద బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా చేసే మహేష్.. ఇలా ఓ టీవీ సీరియల్‌కు ప్రచారం చేయడం ఏంటి అని అంటున్నారు ఫ్యాన్స్.
అక్కడితో ఆగకుండా.. తను వస్తే వచ్చాడు, కూతురు సితారను కూడా ఇలాంటి యాడ్‌లోకి తీసుకురావడం ఎందుకు అని అడుగుతున్నారు. అభిమానులు ఏదో ఇబ్బందితో అడుగుతుంటే.. నెటిజన్లు, ట్రోలర్లు అయితే ట్వీట్లకు పని చెప్పారు. మహేష్.. మాకేంటిది మహేషా అని అడుగుతున్నారు. అసలు మహేష్ ఎందుకిలా చేశాడు అని చూస్తే.. ‘జీ తెలుగు’ ఛానల్‌కు మహేష్‌బాబు బ్రాండ్ అంబాసిడర్ అట. దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నాడు అని టాక్. అందుకే ఈ యాడ్‌లట.
గతంలో పాన్ బహార్ గుట్కా యాడ్ చేసి ట్రోలింగ్‌కు గురైన మహేష్.. ఇప్పుడు ఇలా సీరియల్ ప్రోమోలో కనిపించి ఇంకా హర్ట్ చేశాడు అంటున్నారు. అయితే ఇక్కడే కొంతమంది మహేష్ ఏం సంపాదించినా అది పిల్లల గుండె ఆపరేషన్లకు ఖర్చు పెట్టడానికే కదా అని అంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అభిమానుల బాధ అభిమానులది. మరి మహేష్ ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆయనకే తెలియాలి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!