Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌కి నెటిజన్ల రిక్వెస్ట్‌.. మరి చేస్తారా?

ఇద్దరు సూపర్‌ హీరోలను కలిపి సినిమా చేయడం హాలీవుడ్‌లో చూస్తుంటాం. ఇద్దరేంటి ఒక్కోసారి నలుగురైదుగురు కలసి ఓ సినిమా చేస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు భారతీయ సినిమా ప్రేక్షకులు అలాంటి కాంబినేషన్‌ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కేజీయఫ్‌ 2’ వచ్చిన తర్వాతి నుండే ఈ మాటలు వినిపిస్తున్నాయి అంటే ఆ హీరోలు ఎవరు అనేది అర్థమైపోతుంది. మీరు అనుకుంటున్నది నిజమే ప్రభాస్‌, యశ్‌లే ఆ హీరోలు.

Click Here To Watch NOW

సౌత్‌లో ఇప్పుడు యాక్షన్‌ హీరోలు అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో యశ్‌ ఒకడు. రాకీ భాయ్‌గా ‘కేజీయఫ్‌’ సిరీస్‌ సినిమాల్లో అదరగొట్టేశాడు. చూడగానే వీడు కదా సూపర్‌ హీరో అన్నట్లుగా యశ్‌ను మార్చింది ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు ‘సలార్‌’తో ప్రభాస్‌ను కూడా ఇలానే చూపించబోతున్నారు ప్రశాంత్‌ నీల్. ఇప్పటికే బయటకొచ్చిన లుక్‌లు, లీక్‌ల్లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. దీంతో ఈ ఇద్దరినీ కలపండి ప్రశాంత్‌ భయ్యా అంటూ సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌లు చేస్తున్నారు.

‘కేజీయఫ్‌ 3’ ఉండబోతోంది అంటూ ‘కేజీయఫ్‌ 2’ ఆఖరున టీజర్‌ ఇచ్చి వదిలేశారు ప్రశాంత్‌ నీల్‌. దీంతో ఈ సినిమా గురించి ఆసక్తి బలంగా ఉంది. మరోవైపు ‘సలార్‌’ని కూడా రెండు పార్టుల్లో రిలీజ్‌ చేస్తారని టాక్‌ నడుస్తోంది. దీంతో ‘సలార్‌ 3’ అనే ఆలోచన ఉండొచ్చు అని ఫ్యాన్స్‌ లెక్కేస్తున్నారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే… రాకీ భాయ్‌ని, సలార్‌ని కలిపి చూపించమని కోరుతున్నారు ఉమ్మడి ఫ్యాన్స్‌.

ప్రశాంత్‌ నీల్‌ తలచుకుంటే ఇద్దరు యాక్షన్‌ హీరోలను కలపడం పెద్ద పని కాదు. ఆయన సినిమాల్లో ఒక దానికొకటి ఇంటర్‌లింకింగ్‌గా ఉంటాయి అంటారు. ‘ఉగ్రమ్‌’లో ‘కేజీయఫ్‌’ రాకీ భాయ్‌ పాత్రకు లీడ్‌ ఉంది అనేది కొందరి వాదన. అలాగే ‘కేజీయఫ్‌ 2’లో ‘సలార్‌’ పాత్రకు లీడ్‌ ఉందని మరికొందరి వాదన. ఈ లెక్కన సలార్‌ని, రాకీ భాయ్‌ను కలపడం పెద్ద విషయం కాదంటున్నారు. మరి ఈ మాటలకు ప్రశాంత్‌ నీల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఈ ఇద్దరినీ కలిపితే లెక్క మామూలుగా ఉండదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus