జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ గత మూడు సినిమాలు రీమేక్ సినిమాలు కావడం పవన్ అభిమానులను బాధ పెడుతోంది. ఈ సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నా పవన్ అభిమానులను ఈ సినిమాలు పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. పవన్ వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై కొన్ని నెగిటివ్ కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.
పవన్ కొంతకాలం పాటు రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా స్ట్రెయిట్ ప్రాజెక్ట్ లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రీమేక్ సినిమాలు కావడం వల్ల ఆ సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేసే అవకాశం ఉండట్లేదు. పవన్ సినిమాలకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నా అలా కూడా జరగడం లేదు.
రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి. 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మండే కలెక్షన్లను బట్టి బ్రో ఫైనల్ స్టేటస్ తెలిసే ఛాన్స్ అయితే ఉంది. మండే బుకింగ్స్ మరీ భారీ స్థాయిలో అయితే లేవు. సముద్రఖని సెకండాఫ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బ్రో మూవీ రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.
పవన్ (Pawan Kalyan) పాత్రను అద్భుతంగా ఎలివేట్ చేసే విషయంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే పవన్ నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.