Jr NTR,Rishab Shetty: తారక్ రిషబ్ కాంబోలో సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్.. కానీ?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ (Jr NTR)  , రిషబ్ శెట్టి (Rishab Shetty) కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి మల్టీస్టారర్ లో నటించినా పరవాలేదని లేదా రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తారక్ నటించినా పరవాలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్, రిషబ్ లలో ఎవరు కోరుకున్నా ఈ కాంబో సులువుగానే సెట్ అవుతుంది. దేవర1  (Devara) లో తన పాత్రకు సంబంధించిన షూట్ ను తారక్ ఇప్పటికే పూర్తి చేశారు.

Jr NTR,Rishab Shetty

మంగళూరు ఎయిర్ పోర్ట్ లో తారక్ (Jr NTR) , రిషబ్ శెట్టి (Rishab Shetty) కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమ్మమ్మ ఊరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, రిషబ్ ల మధ్య మంచి అనుబంధం ఉండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్ ఉంది. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్, రిషబ్ కాంబోలో మూవీ అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కాంతార ప్రీక్వెల్ లో అతిథి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారంటూ కూడా కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ప్లానింగ్ విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ లను తారక్ పూర్తి చేసి దేవర2 సినిమాతో బిజీ కానున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

దేవర సినిమా కథకు చాలా సంవత్సరాల క్రితం జరిగిన కారంచేడు ఘటనకు లింక్ ఉందని వార్తలు వినిపిస్తున్నా సినిమా విడుదలైతే మాత్రమే వైరల్ అయిన వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం.. ఆ డేట్ లాక్..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus