Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం.. ఆ డేట్ లాక్..?

నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తోటి స్టార్ల హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేశారు. చిరంజీవి (Chiranjeevi) తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పుడే 15 సినిమాలు తీసేయడమే కాకుండా గ్లోబల్ హీరో ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. మరోపక్క నాగార్జున (Nagarjuna)  ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేసి.. అభిమానులకి ఓ కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు.

Mokshagna

రేపో మాపో వెంకటేష్ (Venkatesh)  కొడుకు అర్జున్ కూడా హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ హీరోగా ఇంకా డెబ్యూ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ వచ్చాయి. మొత్తానికి వాటికి జవాబులు దొరికే సమయం రానే వచ్చేసింది. మోక్షజ్ఞ (Mokshagna) హీరోగా ఎంట్రీ ఇచ్చే తరుణం ఆసన్నమైంది. అవును.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. పూజా కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..

సెప్టెంబర్ 6న రామకృష్ణ స్టూడియోస్ లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ జరగనుంది. అంటే వినాయక చవితికి ఒక్క రోజు ముందుగా అన్నమాట. ఈ పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట.టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్లు ఈ పూజా కార్యక్రమాలకి హాజరయ్యి.. మోక్షజ్ఞకి బెస్ట్ విషెస్ తెలుపనున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్..ఈ వేడుకకి హాజరవుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus