Pushpa Movie: పుష్ప రాజ్ విలన్.. అతి భయంకరంగా..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ అనగానే మొదట అందరూ ఆర్య 3 లేదా మరో మైండ్ గేమ్ లాంటి సినిమా రావచ్చని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక ఊర మాస్ పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తెస్తారని ఎవరు ఊహించలేదు. మొత్తానికి సుక్కు మొదటిసారి ఒక హై వోల్టేజ్ కమర్షియల్ సినిమాను తీసుకు రాబోతున్నట్లు అర్ధమవుతోంది.

ఇక పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్న మలయాళం టాలెంటెడ్ యాక్టర్ ఫాహాద్ ఫాజిల్ ఎలాంటి కిక్కిస్తాడో అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలో ఫాహాద్ చేయబోయేది ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. చాలా భయంకరంగా ఉంటాడట. అల్లు అర్జున్ – ఫాహాద్ మధ్యలో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించడం కాయమని టాక్.

సెకండ్ హాఫ్ లో వైలెన్స్ అంతకుమించి అనేలా ఉంటుందట. ముఖ్యంగా పుష్ప రాజ్ ముసుగుతో చేసే ఫైట్ సీన్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉబుతుందని సమాచారం. ఇక ఫాహాద్ ఫాజిల్ పాత్ర పుష్ప 1లోనే అంతమవుతుందట. ఆ తరువాత సెకండ్ పార్ట్ లో దర్శకుడు సుకుమార్ అంతకంటే పవర్ఫుల్ విలన్ ను తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను ఆగస్ట్ చివారికల్లా పూర్తి చేసి 2022 జనవరిలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus