2000 సంవత్సరంలో విడుదలైన “ఫైనల్ డెస్టినేషన్” చిత్రాన్ని చూసినవాళ్లు ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. చావు భయం ఎలా ఉంటుందో పరిచయం చేసిన చిత్రమది. ఈ సినిమా చూశాక చాలా మంది ప్రతి విషయానికి భయపడేవారట, ఏ కారణంగా చనిపోతామో తెలియక. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన “ఫైనల్ డెస్టినేషన్” సిరీస్ నుంచి దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం వచ్చిన 6వ చిత్రం “ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్” (Final Destination Bloodlines). మరి ఈ సినిమా ఆ సిరీస్ ఫ్యాన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది, ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది అనేది చూద్దాం..!!
కథ: 1968లో ఓ స్కై వ్యూ హోటల్ లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (గాబ్రియల్ రోస్). కానీ.. చావు నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదుగా. అక్కడ బ్రతికినవాళ్లందరినీ ఒక్కొక్కరిగా చావు తరుముతూ.. వాళ్లను మాత్రమే కాక వాళ్ళ కుటుంబాల్ని కూడా బలి తీసుకుంటుంది.
ఆ క్రమంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ను చావు జయించి, ఆమె కుటుంబన్ని ఎలా తుదముట్టించింది అనేది “ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్” (Final Destination Bloodlines) కథాంశం.
నటీనటుల పనితీరు: కయిట్లిన్ మినహా ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలు దొరకలేదు. అయితే.. ప్రతి పాత్ర చనిపోయే విధానం చూస్తే మాత్రం దర్శకరచయితల బృందం చంపడం మీద పీహెచ్ డీ చేశారు అనిపించక మానదు. సీనియర్ ఐరిస్ గా నటించిన గాబ్రియల్ మాత్రం ఉన్న ఒక్క సీన్ లోనే టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: సీజీఐ టీమ్ పనితనాన్ని మెచ్చుకోవాలి. ప్రతి ఒక్క మరణం చాలా రియలిస్టిక్ గా ఉంది. ముఖ్యంగా ఎమ్మారై స్కాన్ సీన్ చూస్తున్నప్పుడు శరీరం కంపించకమానదు. అయితే.. కీలకమైన సన్నివేశాల్ని ట్రైలర్ & ప్రోమోస్ లో పెట్టడం మాత్రం సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను పాడు చేసిందని చెప్పాలి.
టెక్నికల్ గా ఎలాంటి మైనస్ పాయింట్స్ లేవు సినిమాలో. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. “ఫైనల్ డెస్టినేషన్” స్పెషాలిటీయే అన్ ప్రెడిక్టబిలిటీ. కానీ.. సినిమాలో చాలా మరణాలను ముందే ఊహిస్తాం. ఆ కారణంగా సినిమా పెద్దగా ఎగ్జైట్ చేయదు. అయితే.. దర్శకబృందం చేసిన మేకింగ్ విషయంలో తీసుకున్న కేర్, దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ అందించిన సహకారం కారణంగా వచ్చిన అవుట్ పుట్ మాత్రం కచ్చితంగా థ్రిల్ చేస్తుంది.
విశ్లేషణ: మరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం, కథనంలో ఆసక్తి కొరవడడం వంటి కారణాలుగా “ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్” పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే.. ఆ సిరీస్ ఫ్యాన్స్ & ఈ ఫార్మాట్ సినిమాలను ఆస్వాదించే ఆడియన్స్ ను మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. పైన పేర్కొన్నట్లు మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్లో మరీ ఎక్కువగా రివీల్ చేయకుండా ఉండుంటే ఇంకాస్త బాగుండేది. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ టైమ్ పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
ఫోకస్ పాయింట్: ఎగ్జైటింగ్ బట్ నాట్ థ్రిల్లింగ్!
రేటింగ్: 2.5/5