Rashmika: ‘యానిమల్’ విజయంతో అక్కడ రష్మిక దశ తిరిగినట్టేనా..?

రష్మిక మందన కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా స్టార్ డంని సొంతం చేసుకుంది. ఒకప్పుడు హీరోయిన్లను ఎక్కువగా బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకునే వారు. కానీ రష్మిక తర్వాత కన్నడలో మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారట మన తెలుగు దర్శకనిర్మాతలకు తెలిసొచ్చింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన రష్మిక ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమా కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అంతేకాదు నేషనల్ క్రష్ అనిపించుకుంది. అందుకే బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘పుష్ప’ ‘సీతా రామం’ వంటి సినిమాలు హిందీలో కూడా బాగా ఆడాయి. దీంతో రష్మికకి బాగా కలిసొచ్చింది. కానీ ఆమె స్ట్రైట్ గా హిందీలో నటించిన సినిమాలు ‘గుడ్ బయ్’ ‘మిషన్ మజ్ను’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

అయినా రష్మికకి బాలీవుడ్లో క్రేజ్ అయితే తగ్గిపోలేదు. ఈ క్రమంలో ‘యానిమల్’ సినిమా చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో ఆమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అది రష్మిక కి బాగా కలిసొచ్చింది. ‘యానిమల్’ రూపంలో రష్మిక, బాలీవుడ్లో ఓ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది అని చెప్పాలి.

‘యానిమల్’ విజయంతో బాలీవుడ్లో తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని (Rashmika) రష్మిక భావిస్తుంది. ‘పుష్ప 2 ‘ కి కూడా హిందీలో భీభత్సమైన క్రేజ్ ఉంది. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కనుక రష్మిక హిందీలో కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు ముంబైలో ఓ ఇల్లు తీసుకుని అక్కడికి మకాం మార్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus