Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టికెట్ రేట్లు తగ్గనున్నాయా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ కామెడీ, మేనరిజమ్స్ అన్ని అభిమానులతో పాటు మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అందుకే వీకెండ్ అడ్వాంటేజ్ తో ఓపెనింగ్స్ నమోదవుతున్నాయి.

అయితే ఆంధ్రాలో ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేస్తుంది. ఎక్కువ శాతం హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అందుకు ప్రధాన కారణం టికెట్ రేట్లు సామాన్యులు కొనుగోలు చేయని విధంగా ఉండడం వల్లనే అని చెప్పాలి. మల్టీప్లెక్సుల్లో 360, 420 అన్నట్టు ఉన్నాయి టికెట్ రేట్లు. మధ్య తరగతి కుటుంబాలకి ఇది పెద్ద భారం. వాళ్లకి సినిమా తప్ప మరో వినోదం ఉండదు.

కాబట్టి టికెట్ రేట్లు తగ్గించాలని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు. ఈ విషయం పై ‘సర్కారు వారి పాట’ టీం పునరాలోచనలో ఉంది. కుదిరిది సోమవారం నుండీ టికెట్ రేట్లు తగ్గించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని రేపు సాయంత్రం ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇప్పుడే ప్రకటిస్తే వీకెండ్ కలెక్షన్లు దెబ్బ తింటాయి అని నిర్మాతలు భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గించారు. రూ.200 టికెట్ రేటు ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్లి సినిమా చూస్తాయి. సమ్మర్ హాలిడేస్ ను కూడా క్యాష్ చేసుకున్నట్టు ఉంటుంది. మొత్తానికి ‘సర్కారు వారి’ దిగొచ్చినట్టే కనిపిస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus