ఆ మూవీ షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం.. అదే కారణమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం లవ్ రంజన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్ లో అపశృతి చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో వేసిన షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సినిమా కోసం పని చేస్తున్న ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని 32 సంవత్సరాల మనీశ్ దేవాశీ ఈ ప్రమాదంలో మరణించారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని కొంతమంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో రణ్ బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ సంఘటనా స్థలం దగ్గర లేరని తెలుస్తోంది.

ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చిత్ర నిర్మాతలు ఆర్థిక సహాయం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు లవ్ రంజన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023 సంవత్సరం మార్చి 8వ తేదీన హోలీ పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. నిర్మాతలు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రణ్ బీర్, శ్రద్ధా కపూర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus