నటులు అందరూ తెలుగు సినీ కళామ్మతల్లి బిడ్డలే. అయితే తొలి బిడ్డలు అంటే తొలితరం స్టార్ హీరోలే అని చెప్పొచ్చు. అలాంటి స్టార్ హీరోల తొలి తరం ఇప్పుడు పూర్తిగా సినీ కళామ్మతల్లిని వీడిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తుదిశ్వాస వీడటంతో తొలి తరం స్టార్ హీరోలను సినీ పరిశ్రమ, తద్వారా సినీ అభిమానులు కోల్పోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఐదుగురు స్టార్ హీరోలు ఇప్పుడు మనకు లేరు.
ఏ భవనానికైనా నాలుగు మూల స్తంభాలు ఉంటాయి అంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి రావడానికి ఒకానొక సమయంలో ఐదుగురు మూల స్తంభాలుగా నిలబడ్డారు. సినిమా పరిశ్రమకు కొత్త రంగులు అద్దడంలో, మాస్ హీరోయిజాన్ని పంచడంలో, ప్రయోగాలు చేయడంలో.. వీరి పాత్ర చాలా గొప్పది అని చెప్పాలి. అలాంటి తరం ఇప్పటికీ మాకు ఆదర్శం అంటూ నేటి నటులు చెబుతున్నారు అంటే ఎంతలా సినీ పరిశ్రమ మీద తమ ముద్ర వేశారో తెలుసుకోవచ్చు.
ఈ ఐదుగురు దిగ్గజాల్లో తొలుత దివికేగింది నందమూరి తారకరామరావు. ఆయన జనవరి 18, 1996న కన్నుమూశారు. ఆ తర్వాత శోభన్ బాబు లోకాన్ని విడిచారు. మార్చి 20, 2008లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఇద్దరి తర్వాత సినీ పరిశ్రమను ఒంటరిని చేసి వెళ్లిపోయింది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జనవరి 22, 2014న కన్నుమూశారు. ఇక కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు లోకాన్ని వీడారు. సెప్టెంబరు 11, 2022న ఆయన పరమపదించారు. ఇప్పుడు కృష్ణ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచారు.
అలా టాలీవుడ్ స్టార్ హీరోల తొలి శకం ముగిసింది. సినీ పరిశ్రమకు ఎంతో సేవలందించిన ఈ తారలు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఎవరి స్టైల్‌లో వారు సినిమా పరిశ్రమను ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ఐదుగురూ స్వర్గంలో మల్టీస్టారర్ ఫ్రేమ్‌లో కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తుంటారు. వి మిస్ యూ స్టార్స్.. వి మిస్ యూ.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!