Samantha: సమంత ఫిట్‌నెస్‌పై ట్రైనర్‌ కామెంట్స్‌..!

సమంతను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని పిలుస్తుంటారు అందరూ. సినిమాలు, పర్సనల్‌ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్‌కి అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కసరత్తులు చేయడం, యోగా చేయడం, ధ్యానం చేయడం లాంటివి చేస్తుంటుంది. కసరత్తులు చేసే వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. పెద్ద పెద్ద బరువుల్ని అలవోకగా ఎత్తేస్తూ సమంత నటినా.. లేక అథ్లెటా అనే అనుమాం కలిగిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కూడా ఇదే మాట అన్నారు. ఏకంగా ఆమెను కోహ్లీతో పోల్చాడు ఆయన.

ముంఉగా చెప్పుకున్నట్లు ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సమంత… జిమ్‌లో వర్కవుట్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. అలా ఆ మధ్య 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సైతం సులువుగా ఎత్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్… ఇలా రకరకాల కసరత్తులు చేస్తూ ఉంటుంది. దీని ద్వారానే అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా అని చెబుతూ వస్తోంది సమంత. సమంత అంత ఫిట్‌గా ఉంటోంది అంటే కారణం జునైద్‌ షేక్‌.

తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ గురించి సమంత అప్పుడప్పుడు తన సోషల్‌ మీడియా పోస్టుల్లో చెబుతూనే ఉంటుంది. తాజాగా జునైద్ షేక్‌ ఓ ఇంటర్వ్యూలో సమంత ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడాడు. ఫిట్‌గా ఉండటంపై సమంతకు ఉన్న శ్రద్ధ గురించి చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమెను విరాట్ కోహ్లీతో పోల్చాడు కూడా. స‌మంత అథ్లెట్ అయి ఉంటే విరాట్ కోహ్లీలా ఉండేది. అంతగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత ట్రై చేస్తుంది.

అంతేకానీ ఎప్పుడూ చెయ్యను అని చెప్పదు. స్వభావం పరంగా చూస్తే సమంత చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్టమైన ప‌నులు చేయాల‌నుకుంటూ ఉంటుంది. సమంతని చూసి నేను చాలా స్ఫూర్తి పొందుతాను. ఏ రోజూ వర్కవుట్స్‌ అంటే నో చెప్పదు అంటూ సమంతను ఆకాశానికెత్తేశాడు జునైద్‌ షేక్‌. అంతలా కష్టపడుతోంది కాబట్టే… ఇంత ఫిట్‌గా ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus