జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సింప్లిసిటీ గురించి చాలా సందర్భాల్లో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం ఫలితం తేలిపోనుంది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తానని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ ఫ్యాన్స్ అనందానికి అవధులు ఉండవు. అయితే పవన్ వ్యక్తిత్వానికి సంబంధించి ఎస్వీ.ఎస్.ఎన్ వర్మ మాట్లాడుతూ ఒకానొక సమయంలో పవన్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడుతూ కూర్చున్నానని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నా గొంతులో ఇబ్బందిని గమనించి పవన్ కళ్యాణ్ లేచి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చారని వర్మ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తులు స్టార్ డమ్ తో ఇతరులతో సంబంధం లేకుండా ఇలా ఇతరులను గౌరవించడం అంటే ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గొప్పదనం గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఇప్పటికే ప్రకటించిన సినిమాలను వేగంగా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఓజీ (OG Movie) , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాలకు పవన్ చెరో 20 రోజుల డేట్స్ ఇచ్చినా ఆ సినిమా షూట్ పూర్తి కావడం సులువేనని సమాచారం అందుతోంది.
అయితే ఆ సినిమాల షూట్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాల్సి ఉంది. తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు లాభం కలిగే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా స్టార్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.