పిక్‌ టాక్‌: ఇంతందం ఒక్క ఫ్రేమ్‌లో ఎలా పట్టిందబ్బా!

అభిమాన హీరోయిన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో కనిపిస్తే లైక్‌లు, షేర్లతో మోత మోగించేస్తుంటారు అభిమానులు. అంలాంటిది ఒకేసారి నలుగురు హీరోయిన్లు, అందులోనూ నేటి టాప్‌ కుర్ర హీరోయిన్లు అయితే ఆ ఫొటోకు ఇంకెన్ని లైక్‌లు రావాలి, ఎన్నేసి షేర్లు రావాలి చెప్పండి. అదే జరుగుతోంది కల్యాణి ప్రియదర్శన్‌ షేర్‌ చేసిన కొత్త ఫొటోకి. ఇటీవల ఓ కార్యక్రమంలో తన తోటి యువ కథానాయికలతో ఆమె దిగిన ఫొటోను షేర్‌ చేసింది కల్యాణి ప్రియదర్శన్‌ ఇప్పుడది వైరల్‌గా మారింది.

నేటి తరం హీరోయిన్లతో స్నేహితులు ఎక్కువ. ఒకరిపైకొరు స్నేహాన్ని ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి హాజరైనప్పుడు కచ్చితంగా తమ స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు అలాంటి మూమెంట్స్‌ మనకు కనిపించేవి కావు. కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని అలాంటివన్నీ చూస్తున్నాం. అలా ప్రియాంక అరుళ్‌ మోహన్‌, కల్యాణి ప్రియదర్శన్‌, కృతి శెట్టి, సాయిపల్లవి దిగిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. నలుగురు బ్యూటీస్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసి వావ్‌ అనుకుంటున్నారు.

వీళ్లంతా ఎక్కడ కలిశారు, ఎందుకు కలిశారు అనే విషయాలు అయితే తెలియవు కానీ, అందరూ కలిపి ఉన్న ఫొటో మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. ఇంత అందం ఒక్క ఫ్రేమ్‌లో పొందుపరచడం చాలా కష్టం కదా. అందులో హాట్‌ బ్యూటీస్‌ ఉన్నప్పుడు ఇంకా కష్టం. 4 ఏంజెల్స్‌ ఇన్‌ వన్‌ పిక్‌, జూనియర్‌ ఏంజెల్స్‌, నలుగురు సుందరీమణులు అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్‌ ఈ ఫొటో షేర్‌ చేయడంతో మిగిలిన నాయికలు లైక్‌లు, లవ్‌ సింబల్స్‌ పెడుతున్నారు.

మూమూలుగా అయితే ప్రియాంక అరుళ్‌ మోహన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తమిళ సినిమాలు చేస్తారు కాబట్టి పరిచయం ఉండొచ్చు. సాయిపల్లవికి, కల్యాణికి మలయాళ సినిమా బంధం ఉంది. కృతి శెట్టి వీరికి ఎలా కలిశారు అనేది తెలియడం లేదు. కృతి శెట్టి కన్నడకు చెందిన అమ్మాయి. బాలీవుడ్‌లో చిన్న పాత్రలు చేసి తెలుగులోకి వచ్చేసింది. ఏదైతే ఏముంది మొత్తంగా సౌత్‌ సినిమా అందమంతా ఒకే ఫొటోలో ఉందిగా.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.