Gaami Collections: ‘గామి’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
- March 13, 2024 / 04:51 PM ISTByFilmy Focus
విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ (Gaami) ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో (Chandini Chowdary) చాందినీ చౌదరి హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 2.82 cr |
| సీడెడ్ | 0.80 cr |
| ఉత్తరాంధ్ర | 0.81 cr |
| ఈస్ట్ | 0.56 cr |
| వెస్ట్ | 0.36 cr |
| గుంటూరు | 0.45 cr |
| కృష్ణా | 0.41 cr |
| నెల్లూరు | 0.24 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.45 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.71 cr |
| ఓవర్సీస్ | 2.20 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 9.36 cr (షేర్) |
‘గామి’ చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.36 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?












