ఆ హీరో డ్యాన్స్ అంటే ఇష్టమంటున్న కిరీటిరెడ్డి!

  • September 9, 2022 / 05:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అటు క్లాస్ ప్రేక్షకులలో, ఇటు మాస్ ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా తారక్ కు అక్కడి స్ట్రెయిట్ హీరోల స్థాయిలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో బళ్లారిలో కూడా తెలుగు సినిమాల కలెక్షన్లు అదే రేంజ్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే.

గాలిజనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా కిరీటిరెడ్డి మాట్లాడుతూ బళ్లారిలో మేము సినిమా పిచ్చివాళ్లమని ఇక్కడ భాషతో పని లేకుండా అన్ని రకాల సినిమాలను ప్రోత్సహిస్తామని ఆయన కామెంట్లు చేశారు. నేను వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆరాధిస్తానని కిరీటిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ సార్ కు నేను వీరాభిమానినని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లను నేను ఎంతగానో ఇష్టపడతానని ఆయన కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కుతాయని ఆయన వెల్లడించారు. గాలి జనార్థన్ రెడ్డి జగన్ సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే. జగన్ సన్నిహితుడి కొడుకు అయిన కిరీటిరెడ్డి ఈ తరహా కామెంట్లు చేయడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా మాస్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు తారక్ అభిమానులను ఇటు కొరటాల అభిమానులను ఫిదా చేసేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. తారక్ ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus