Gam Gam Ganesha : హాట్ టాపిక్ గా మారిన ‘గంగం గణేశా’ ట్రైలర్!
- May 21, 2024 / 04:50 PM ISTByFilmy Focus
‘బేబీ’తో (Baby) కెరీర్లో మొదటి హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) . యూత్ ని ఆ సినిమా అమితంగా ఆకట్టుకుంది. ఆనంద్ దేవరకొండ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో అతని నెక్స్ట్ మూవీ ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) పై ప్రేక్షకుల దృష్టి పడింది. టీజర్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. మొత్తానికి మే 31 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తాజాగా ట్రైలర్ ని వదిలారు.

వినాయక చవితి పండుగ నేపథ్యంలో జరిగే కథ ఇది. హీరో ఓ దొంగ. అతనికి ఎదురైన ఛాలెంజ్ ఏంటి? ఓ పొలిటీషియన్, రాజావారు, విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ హీరో జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత అతనికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు అనేది కూడా ట్రైలర్లో చూపించారు. ‘బేబీ’ లో ఎమోషన్ బాగా పండించిన ఆనంద్ దేవరకొండ..

ఈ సినిమాలో కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా రుచి చూపించారు. అలాగే టీజర్లో లిప్ లాక్ కూడా హైలెట్ అయ్యింది. సో ఈ సినిమా కనుక సక్సెస్ సాధిస్తే కమర్షియల్ ఇమేజ్ కూడా ఇతనికి దక్కే ఛాన్స్ ఉంటుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. కానీ ఈ క్రైమ్ కామెడీ జోనర్ ఆనంద్ కి కలిసొస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
















