Game Changer: ఎవ్వరూ ఊహించలేదు.. అక్కడ ‘దేవర’ రికార్డు కొట్టిన ‘గేమ్ ఛేంజర్’

మెగా పవర్ స్టార్ రాంచరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నిన్న రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్లో 50 వ సినిమాగా రూపొందింది. మొదటి రోజు మొదటి షోతో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈవెనింగ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే థియేటర్స్ కి వెళ్లారు. టాక్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కూడా ‘గేమ్ ఛేంజర్’ మంచి నంబర్స్ పెడుతుంది అని అంతా అనుకున్నారు.

Game Changer

అది నిజమే అయ్యింది. టాక్ తో సంబంధం లేకుండా ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కానీ మేకర్స్ ఏకంగా రూ.186 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు పోస్టర్ వేసుకున్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఓపెనింగ్స్ పరంగా ‘గేమ్ ఛేంజర్’ రికార్డులు కొట్టింది అంటూ ఏమీ లేదు. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. కర్ణాటక, తమిళ్, నార్త్ వంటి ఏరియాల్లో కూడా ‘గేమ్ ఛేంజర్’ బాగా కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా రూ.8.64 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది.

ఇవి రికార్డు నంబర్లు కాదు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ కంటే ‘గేమ్ ఛేంజర్’ కాస్త ఎక్కువగానే కలెక్ట్ చేసింది. ‘దేవర’ సినిమా మొదటి రోజు హిందీలో రూ.7.95 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించిన సంగతి తెలిసిందే. ‘దేవర’ ని క్రాస్ చేయడంతో హిందీలో ‘గేమ్ ఛేంజర్’ బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పవచ్చు. రెండో రోజు కూడా అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. వీకెండ్ వరకు అక్కడ మంచి ఇదే పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశం ఉంది. హిందీలో ఈ సినిమా రూ.50 కోట్ల నెక్ట్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి.

గేమ్ ఛేంజర్.. అందరి ఫోకస్ రాజమౌళిపైనే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus