Game Changer: ‘గేమ్ ఛేంజర్’.. ఇప్పుడు అంతా హ్యాపీ కదా..!

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie) తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నుండి రాబోతున్న సినిమా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్  (Shankar)  దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తమన్(S.S.Thaman)   సంగీత దర్శకుడు. ‘జరగండి’ ‘రా మచ్చ మచ్చ రా’ ‘నానా హైరానా’ ‘దోప్’ వంటి లిరికల్ సాంగ్స్ ప్రమోషన్లలో భాగంగా విడుదల చేశారు. అవి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకున్నాయి. 2021 లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ వచ్చింది.

Game Changer

అందువల్ల బడ్జెట్ కూడా పెరిగిపోతూ వచ్చింది. అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు (Dil Raju)  ఏమాత్రం రాజీ పడకుండా, వెనకడుగు వేయకుండా ఈ చిత్రం షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. మరో వారం రోజుల్లో.. అంటే జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాబోతుంది. అయితే ట్రైలర్ కి ముందు ‘గేమ్ ఛేంజర్’ కి బజ్ అంతగా లేదు. కానీ ట్రైలర్ తర్వాత లెక్కలు మారిపోయాయి.

అవును.. ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. అందులో కథపై ఏమాత్రం హింట్ ఇవ్వకుండా కట్ చేశారు. అందుకే ఆడియన్స్ దానికి కనెక్ట్ కాలేదు. అయితే ట్రైలర్ విషయంలో మేకర్స్ ఆ తప్పు చేయలేదు. కథ ఎలా ఉంటుంది? ఏ పాత్ర స్వభావం ఎలాంటిది? హీరో స్ట్రగుల్ ఏంటి? అనే విషయాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

నిర్మాత పెట్టిన ఖర్చు అంతా ఆ విజువల్స్ లో కనిపించింది. సో ఇప్పుడు బయ్యర్స్ కి కూడా ధైర్యం పెరిగింది. కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయం అని వారు భావిస్తున్నారు. మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా మరో రెండు రోజుల్లో ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు కాబట్టి.. ఆల్మోస్ట్ అది కూడా సక్సెస్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus