Game Changer: గేమ్ ఛేంజర్ సాంగ్స్ బడ్జెట్ , మగధీర టోటల్ బడ్జెట్!

రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న “గేమ్ ఛేంజర్”(Game Changer) చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 థియేటర్లలో సందడి చేయనుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలు ఎల్లప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సారి కూడా తన మార్క్ చూపించేందుకు శంకర్ గ్రాండ్ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీతో పాటలను హైలైట్ చేశారు.

Game Changer

అయితే, పాటల కోసం ఖర్చు చేసిన మొత్తం షాకింగ్ అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. “గేమ్ ఛేంజర్” మొత్తం బడ్జెట్ రూ. 350 కోట్లు కాగా, కేవలం పాటల కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇది రాజమౌళి (S. S. Rajamouli) “మగధీర” (Magadheera) సినిమా మొత్తం బడ్జెట్ (40 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ భారీ ఖర్చుకు నిదర్శనం. “జరగండి” పాట కోసం 600 మంది డ్యాన్సర్లు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్, 13 రోజుల షూటింగ్ జరిగింది.

ఈ పాటకు ఉపయోగించిన సెటప్‌నే చూస్తే పాట కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. “రా మచ్చా మచ్చా” పాట మరింత వైవిధ్యంగా రూపొందించబడింది. 1,000 మంది జానపద కళాకారులను వివిధ రాష్ట్రాల నుండి తీసుకురావడం, వారి ప్రదర్శనలతో పాటను ఫుల్ ఎనర్జీతో నింపడం జరిగింది. “నానా హైరానా” పాట న్యూజిలాండ్‌లో చిత్రీకరించబడింది. ఈ పాట కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించడం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన శైలిని చూపించారు. ఇది సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండటమే కాకుండా, విజువల్ గా కూడా రిచ్ అనిపించింది.

అలాగే, “డోప్” పాట కోసం రష్యన్ డ్యాన్సర్లను తీసుకొచ్చి, ప్రత్యేక సెట్ లో చిత్రీకరించారు. పాటల కోసం ఇంత స్థాయిలో ఖర్చు చేయడం ఒక బహుళ భాషా చిత్రానికి మాత్రమే సాధ్యమవుతుంది. చివరి సాంగ్ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది, ఇది మరో హైలైట్‌గా మారనుంది. ఈ పాటల క్రియేషన్ వెనుక శంకర్ స్టైల్, ఖర్చు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే నిర్మాత దిల్ రాజు (Dil Raju) కెరీర్ లో కూడా ఇదే అత్యధిక బడ్జెట్ (350కోట్లు). మరి ఆయన ఏ రేంజ్ లో లాభాలు అందుకుంటారో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌: మెగా + పవర్‌ను స్టేజీ మీద చూడలేం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus