మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, రామ్ చరణ్ కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్ ప్రాజెక్టుగా నిలవనుంది. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ ముందుగా సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు.
Game Changer
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే, ఈ సినిమా రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరుకోవాలంటే, బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.400-450 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి రూ.130 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ మంచి మౌత్ టాక్ ఉంటే ఈ టార్గెట్ సులభంగా చేరుకోవచ్చు.
అయితే, గేమ్ ఛేంజర్ విజయం పాన్ ఇండియా రేంజ్‌లోనూ కీలకమని చెప్పాలి. హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు. కానీ నార్త్‌లో రామ్ చరణ్ క్రేజ్ పుష్ప 2 (Pushpa 2) స్థాయికి చేరాలంటే మౌత్ టాక్ బాగా ఉండటం కీలకం. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి సౌత్ మార్కెట్లలోనూ గేమ్ ఛేంజర్ బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి గరిష్టంగా రూ.70-80 కోట్ల వసూళ్లు రావాలని అంచనా.
ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను థియేటర్లకు రప్పించగల హై ఎనర్జీ సన్నివేశాలు, శంకర్ మార్క్ మ్యాసీవ్ మేకింగ్ దీనికి కీలకమవుతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, కియారా అద్వానీ(Kiara Advani) ., అంజలి (Anjali), శ్రీకాంత్(Srikanth) , నాజర్ (Nassar), సునీల్ (Sunil) , సముద్రఖని (Samuthirakani) , ఎస్ జే సూర్య (SJ Suryah) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ఆసక్తి రేపుతోంది.