Gandeevadhari Arjuna OTT: ‘గాండీవదారి అర్జున’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు.. ఎక్కడ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..

మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే మెసేజ్ ఉన్నప్పటికీ కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో.. ప్రేక్షకులు పెదవి విరిచారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన స్థాయిలో ఈ మూవీ పెర్ఫార్మ్ చేయడం లేదు. ఇక థియేటర్లలో ఈ మూవీ చూడటం కుదరని ప్రేక్షకులు.. డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వాటి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం..

‘గాండీవధారి అర్జున’ చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. సినిమా రిలీజ్ అయిన 3 వారాలకు.. అంటే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 నుండి .. ‘గాండీవధారి అర్జున’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేట్ అయితే సెప్టెంబర్ 21 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడైనా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుందేమో చూడాలి.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus