విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమా ఏ క్షణాన మొదలైందో కానీ ఈ సినిమా ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ తర్వాత శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. అయితే ఆ సమయానికి కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో మే 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది.
అయితే ఈ సినిమా మరో రెండు వారాలు పోస్ట్ పోన్ అయ్యి మే నెల 31వ తేదీన విడుదల కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలకు సరిగ్గా 4 రోజుల ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రిలీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విశ్వక్ సేన్ కు తిరుగుండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ వరుస విజయాలతో క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారు.
విశ్వక్ సేన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో ఏ సందేహం అవసరం లేదు. మరోవైపు సితార బ్యానర్ కు కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సితార బ్యానర్ లో తెరకెక్కిన చిన్న సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నాయి. మ్యాడ్ (MAD) , టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా ఈ సినిమాల చెంతన చేరుతుందేమో చూడాలి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా త్వరలో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్స్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విశ్వక్ సేన్ తన సినిమాల కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వక్ సేన్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది.