ఈ హీరోలకు విరామం బాగా కలిసొచ్చింది

ఈ ఏడాది బాగా గ్యాప్ తరువాత వచ్చిన ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు. ఒకరు అల్లు అర్జున్ కాగా మరొకరు నితిన్. అల్లు అర్జున్ సంక్రాంతి మూవీ అల వైకుంఠపురంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అనేక కొత్త రికార్డ్స్ తన పేరిటన నమోదు చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. అల వైకుంఠపురంలో బన్నీ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ 2018 మే 4న విడుదలైంది. ఆ చిత్ర పరాజయం తరువాత బన్నీ చాల కాలం ఆలోచించి త్రివిక్రమ్ ని ఎంచుకున్నారు. దాదాపు 18నెలల విరామం తరువాత వచ్చిన బన్నీ బంపర్ హిట్ అందుకున్నారు.

ఇక నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణం మూవీ పరాజయం తరువాత భారీ గ్యాప్ తీసుకున్నారు. ఆ చిత్రం ఆగస్టు 9, 2018లో విడుదల కాగా ఏడాదిన్నర తరువాత భీష్మ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఇద్దరు హీరోలు పరాజయం తరువాత ఓపికగా ఎదురుచూసి మంచి సబ్జెక్స్ ఎంచుకొని హిట్ ట్రాక్ ఎక్కారు. ఇక నితిన్ ప్రస్తుతం మొత్తం నాలుగు సినిమాలు కన్ఫర్మ్ చేశారు. బన్నీ దర్శకుడు సుకుమార్ తో మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus