రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది. రామరాజు పాత్రలో చరణ్, భీమ్ పాత్రలో తారక్ అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే విధంగా నటించడం గమనార్హం. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత భీమ్ పాత్ర విషయంలో జక్కన్న కొన్ని తప్పులు చేశాడని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. సినిమాలో చివరి అరగంటలో స్క్రీన్ స్పేస్ విషయంలో తారక్ కు అన్యాయం జరిగిందని తారక్ అభిమానులలో కొందరు ప్రధానంగా చెబుతున్నారు.
మరి కొందరు తారక్ ఫ్యాన్స్ మాత్రం తారక్ రోల్ విషయంలో తాము సంతృప్తితో ఉన్నామని ఫస్టాప్ లో భీమ్ పాత్ర హైలెట్ అయితే సెకండాఫ్ లో రామరాజు పాత్ర హైలెట్ అయిందని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ పాత్ర విషయంలో వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి తాజాగా గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఫ్యాన్స్ తీరుపై తనదైన శైలిలో చురకలు అంటించారు. స్పష్టంగా లేని పక్షంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్లు ఇబ్బంది పడతారని ఆయన చెప్పుకొచ్చారు.
కళాకారులు అభిమానుల ఆశల ప్రకారం బ్రతకాలా అని ఆయన ప్రశ్నించారు. తారక్, సచిన్ అనుభవిస్తున్న అవస్థ గురించి మొహమాటం లేకుండా తాను చెబుతున్నానని ఆయన అన్నారు. అభిమానులు తమకు ఇష్టమైన హీరోలు అంచనాల ప్రకారం ఉండాలని అనుకుంటారని నటుడు హీరో వేషం కాకుండా గుమస్తా, విలన్ వేషం వేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. నటులలోని నటనను బయటకు రానీయరా అని గరికపాటి కామెంట్లు చేశారు. ఆట అంటే కొన్నిసార్లు గెలుస్తామని కొన్నిసార్లు ఓడిపోతామని కళాకారులపై ఒత్తిడి పెంచితే హీరోలు ఒత్తిడికి లోనవుతారని ఆయన అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్ని రకాల పాత్రలు చేశారని దర్శకుడు చెప్పిన విధంగా నటులు వినాలని గరికపాటి వెల్లడించారు. హీరోలు ఎలా ఉండాలనే విషయంలో ఒత్తిడి పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భీమ్ పాత్ర విషయంలో తారక్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గరికపాటి ఈ కామెంట్లు చేశారు.