సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని, టాలీవుడ్ చరిత్రలో నందమూరి వంశం ఖ్యాతి తిరుగులేనిది వెలిగిపోవాలని…నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమాను .. శాతవాహన చక్రవర్తి తెలుగు శఖానికి నాంది పలికిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను సినిమాగ తీయాలని అనుకోవడం…అనుకోని విధంగా ఆ కధను క్రిష్ అందించడం, వెనువెంటనే సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించడం జరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ సినిమా కధను సినిమా దర్శకుడు క్రిష్ మాత్రమే ఆచార్యుల వారు అందించారని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా ఆచార్యులు…
అంటే మాత్రం ఈ కధ చదవాల్సిందే…బాలయ్య, క్రిష్ ఈ సినిమా చేద్దామని అనుకున్న వెంటనే క్రిష్ తనకు తెలిసిన సమాచారాన్ని తీసుకురాగా.. ప్రొఫెసర్ రంగనాయకులను ప్రత్యేకంగా బాలయ్య కలవడం.. సినిమా గురిచి చెప్పి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను ఆయన చేత రాయించడం జరిగిందట. అయితే ఆయన రాసి ఇచ్చిన కధను తెరపై ఆవిష్కరించే పనిలో పడ్డాడు క్రిష్. ఇంతకీ ఈ ప్రొఫెసర్ రంగనాయకులు ఎవరంటే..తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలతో ప్రొఫెసర్ గ పనిచేస్తున్నారు.. ఈయనకు మన చరిత్ర మీద ఎంతో అవగానహ ఉంది. ఇంతకుముందు చరిత్రకి సంబందిచిన పుస్తకాలు ఎన్నో రచించడం జరిగింది. అందుకే బాలయ్య మెచ్చి మరీ ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి మూల కథను ఆయన చేత రాయించడం జరిగింది. ఇక గత ఏడాది కంచె సినిమాతో తక్కువ బడ్జెట్ తోనే రెండవ ప్రపంచ యుద్ధం ఫీల్ ను కలిగించిన క్రిష్ ఈ సినిమాతో చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తీర్చిదిద్దుతాడని అందరూ ఆశిస్తున్నారు. మరి క్రిష్ ఏం చేస్తాడో…తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.