పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ “గీతగోవిందం”. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించారు. ఆ పాటలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం .
ఇంకేం ఇంకేం కావాలేఆడియో వేడుకకంటే ముందుగానే యూట్యూబ్ లో రిలీజ్ అయిన పాట “ఇంకేం ఇంకేం కావాలే”. ఈ పాట అందరినీ విశేషంగా ఆకట్టుకొని ఆల్బమ్ పై మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అందుకే ఆల్బంలో దీనిని మొదటి పాట గా పెట్టారు. అనంత్ శ్రీరామ్ చాలా రోజులకి అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా గాయకుడు సిడ్ శ్రీరామ్ విభిన్నమైన గాత్రంతో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.
ఏంటి ఏంటి ఏంటి ప్రేమలో ఉన్నవారు గాల్లో తేతున్నట్టు ఫీలవుతుంటారు. అలాంటి ఫీల్ ని ఇచ్చే ట్యూన్ తో గోపి సుందర్ “ఏంటి ఏంటి ఏంటి ” అనే పాటని కంపోజ్ చేశారు. శ్రీ మణి సరళంగా ఇచ్చిన సాహిత్యాన్నీ చిన్మయి ఎంతో మధురంగా పాడారు.
వచ్చిందమ్మా తనకు కాబోయే అర్ధాంగి గురించి ఎంత అందంగా తిట్టొచో.. ఎంత సుకుమారంగా నిందలు వేయేచ్చో అనంత్ శ్రీరామ్ ఈ పాటలో చెప్పారు. పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అనే ప్రయోగాలు బాగున్నాయి. ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడిన విధానం మనసుకు హత్తుకుంటుంది.
వాట్ ద లైఫ్ యూట్యూబ్ లో ఈ మధ్య ఎక్కువ వ్యూస్ అందుకున్న పాట ఇంకేం ఇంకేం కావాలే అయితే.. చిరాకు పెట్టించిన పాట వాట్ ద లైఫ్. ఈ రెండూ గీత గోవిందంలోనిదే కావడం విశేషం. శ్రీ మణి రచించిన ఈ పాటను విజయ్ దేవరకొండ పాడి సంచలనం(నెగటివ్) సృష్టించారు. వై దిస్ కొలవరి ఛాయలు కనిపిస్తున్న ఈ పాటకు విమర్శలు రావడంతో వేరొకరితో పాడిస్తామని చెప్పారు. అప్పుడైనా ఆకట్టుకుందేమో చూడాలి.
కనురెప్పల కాలంలోనే..ఆల్బమ్ లోని చివరి పాట “కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే”. సాగర్ రచించిన ఈ పాటకు గోపి సుందర్ ట్యూన్ ఇవ్వడమే కాదు.. ఆలపించారు కూడా. మాంటేజ్ సాంగ్ కి అతని గాత్రం ఎంతో చక్కగా సూట్ అయింది.
చివరగా..
సున్నితమైన కథలకు సంగీతం, సాహిత్యం చాలా ముఖ్యం. అలా పాటలని రాయించుకోవడంలో.. ట్యూన్స్ తీసుకోవడంలో పరుశురాం విజయవంతమయ్యారు. రెండు పాటలు సోసోగా ఉన్నప్పటికీ మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు పాటలకు విజువల్స్ బాగుంటే.. అవి కూడా హిట్ అయ్యే ఆస్కారం ఉంది. టోటల్ గా వినదగిన ఆల్బమ్ ఇది. సినిమాకి తప్పకుండా ప్లస్ అవుతుంది.