Geetha Madhuri: ఉదక శాంతి పూజ ఆచరించిన గీతా మాధురి దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

గీతా మాధురి ఇప్పుడు నిండు గర్భిణీ అనే సంగతి తెలిసిందే. ఆమె రెండోసారి గర్భం దాల్చింది. గీతా- నందు దంపతులకి ఇదివరకే ఓ పాప కూడా ఉంది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. ఆమె ఫోటోలను కూడా వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక గీతా మాధురికి ఇప్పుడు 9వ నెల కావడంతో.. ఈ మధ్యనే కుటుంబ సభ్యులు ఆమెకు ఘనంగా సీమంతం వేడుకని నిర్వహించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. సీమంతం వేడుకకు ముందే గీతా మాధురి- నందు దంపతులు ఉదక శాంతి పూజని కూడా ఆచరించినట్లు తెలుస్తుంది. చాలా మందికి ఉదక శాంతి పూజ అంటే తెలియకపోవచ్చు. కుటుంబ శ్రేయస్సు కొరకు, ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ శ్రేయస్సు కొరకు ఈ పూజలో పాల్గొంటారు. గర్భం దాల్చిన స్త్రీ తన అత్తగారింట్లో వారందరితో కలిసి ఈ పూజని ఆచరించాలట. అందుకే గీతా- నందు దంపతులు సీమంతం వేడుకకు ముందుగా ఈ పూజలో పాల్గొన్నట్టు స్పష్టమవుతుంది.

ఇక నందు – గీతా..లు 2014లో పెళ్లి చేసుకున్నారు. గీత సింగర్ గా రాణిస్తుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇక నందు నటుడిగా రాణిస్తున్నాడు. అలాగే కొన్ని టీవీ షోలకి హోస్ట్ గా చేస్తుంటాడు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి (Geetha Madhuri) గీతా- నందు..ల ఉదక శాంతి పూజ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus