Geetha Singh: వాళ్లు అవమానిస్తే అల్లరి నరేష్ నా పరువు కాపాడారు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న వారిలో నటి గీత సింగ్ ఒకరు. ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇలా హీరోయిన్ గా నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఎన్నో సినిమాలలో నటించి సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు.

ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండి తన లైఫ్ హ్యాపీగా కొనసాగుతుంది అనుకునే సమయంలో తనకు అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయని ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఇలా క్రమక్రమంగా తనకు అవకాశాలు తగ్గిపోతూ ప్రస్తుతం అవకాశాలు రావడమే లేదని ఆవేదన చెందారు. ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని అందుకే మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకు ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నాయంటూ ఈమె ఆవేదన చెందారు.

ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఇద్దరు హీరోయిన్లు తన పట్ల చాలా అవమానకరంగా మాట్లాడారని ఈమె ఆ హీరోయిన్ల పేర్లు ప్రస్తావించకుండా తనకు జరిగిన అవమానం గురించి తెలిపారు.తనని చూసి ఈమె హీరోయిన్ ఏంటి అంటూ చాలా అవమానకరంగా మాట్లాడారని గీత సింగ్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు హీరోయిన్లు నా గురించి అలా మాట్లాడుతూ ఉండగా ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న అల్లరి నరేష్ వారి ఎదుటకు వెళ్లి మీ కన్నా ముందు

ఈమె నా హీరోయిన్ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆ హీరోయిన్లు షాక్ అవ్వడమే కాకుండా అప్పటినుంచి తనని మేడం అంటూ పిలవడం మొదలు పెట్టారని గీత సింగ్ వెల్లడించారు. ఇలా ఆ ఇద్దరు నా పరువు తీయగా అల్లరి నరేష్ మాత్రం తన పరువు కాపాడారని ఈ సందర్భంగా గీతా సింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus