Geetu Royal: డిప్రెషన్ లో ఉన్నానని నాగార్జున మరోసారి పిలిపించారు: గలాటా గీతూ

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు చిత్తూరు చిరుత గలాటా గీతూ. బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే తన మాట తీరుతో ఈ షో మొదట్లో ఎంతో మందిని ఆకట్టుకున్నప్పటికీ చివరికి ఈమె విసుగు తెప్పించడంతో తొమ్మిదవ వారంలోనే హౌస్ నుంచి బయటకు పంపించారు. ఇకపోతే గీతూ హౌస్ లోకి ఎలాగైనా కప్పు సాధించాలని అడుగుపెట్టారు.

అయితే ఊహించని విధంగా తొమ్మిదవ వారం ఎలిమినేట్ కావడంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇలా చాలా రోజులు పాటు డిప్రెషన్ లో ఉన్నటువంటి గీతూ ఈ వీడియో ద్వారా బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు విషయాలు తెలియజేశారు. బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తూ ఎంతో ఎమోషనల్ అయినా గీతూ తాను కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు ఉండి ఉంటే బాగుండేది అక్కడి వరకు ఉంటానని తను తన అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చీర కూడా కొన్నానని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా తన డిప్రెషన్ లో ఉన్నానని తెలిసి నాగార్జున గారు మరోసారి తనని పిలిపించారని ఈమె ఈ వీడియో సందర్భంగా తెలియజేశారు. ఇలా డిప్రెషన్ లో ఉన్నటువంటి తాను ఇప్పుడిప్పుడే బయటికి వచ్చానని అయితే బయటకు వచ్చిన తర్వాత తాను చేసిన ఒక పని గురించి తెలియజేస్తూ మా అమ్మకు కనక ఈ విషయం తెలిస్తే నన్ను చెప్పుతోనే కొడుతుంది అంటూ కామెంట్ చేశారు.

ఈమె తన కుడి కాలు పై చిరుత చారల పచ్చబొట్టు వేయించుకుంది. అయితే ఇది వేసే సమయంలో నొప్పి తెలియకుండా ఉండడం కోసం బిగ్ బాస్ కార్యక్రమం చూస్తూ ఉన్నానని ఈ సందర్భంగా టాటూకి సంబంధించిన ఫోటోని చూపిస్తూ అసలు విషయం వెల్లడించారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus