తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చిన జెనీలియా..!

‘బాయ్స్’ ‘సత్యం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా ఆ తరువాత ఎన్టీఆర్ తో ‘సాంబా’ ‘నా అల్లుడు’,నితిన్ తో ‘సై’ ,వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’,సిద్దార్థ్ తో ‘బొమ్మరిల్లు’, విష్ణుతో ‘ఢీ’, రామ్ తో ‘రెడీ’ వంటి బడా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది.అటు తరువాత బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాల్లో నటించింది. ఈ నేపథ్యంలో 2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్‌’ షూటింగ్‌ టైములో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడింది.అటు తరువాత వీరిద్దరూ కలిసి 10ఏళ్ళ పాటు డేటింగ్‌ చేశారు. తరువాత 2012లో ఇరుకుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరి అన్యోన్యత ఎలా ఉంటుంది..? గొడవలు వంటివి ఏమైనా వస్తాయా అని జెనీలియాను ప్రశ్నించగా ఆమె దానికి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నేను రితేష్ డేటింగ్‌లో ఉన్నప్పుడు.. ఇన్నేళ్ల పాటు రిలేషన్‌ను ఎలా కొనసాగిస్తున్నారు అంటూ చాలా మంది ప్రశ్నించారు.? ఆ టైములో మా దగ్గర సమాధానం లేదు.తరువాత మాకు పెళ్లై పిల్లలు పుట్టినప్పుడు కూడా అలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. నిజానికి రితేష్ నేను ప్రతీ విషయాన్ని వెంటనే షేర్ చేసుకుంటాం. దాంతో మా మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు.అది లేకపోతే రిలేషన్స్ లో ప్రాబ్లెమ్స్ వస్తాయి. అలా అని మా మధ్యలో గొడవలు రావా? అంటే .. మేము కూడా వాదించుకుంటాం.

అలాగే తరువాత తను లేకపోతే నేను జీవించలేను అనే ఎమోషన్ కూడా ఉంటుంది. గొడవలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే.! మా ఇద్దరికీ లైఫ్‌లో ఏది ముఖ్యమో అది బాగా తెలుసు. అందుకే చిన్న విషయాలను పట్టించుకోము. రితేష్‌ వల్ల నాకు ఎప్పుడూ సమస్యలు రావు, అందుకు నిజంగా అతన్ని మెచ్చుకోవాలి. నేను గొడవపెట్టుకోవాలి అనుకుంటే తప్ప… మా మధ్య ఎటువంటి గొడవలు రావు. అంతేకాదు మేము గొడవ పడిన సందర్భాల గురించి కూడా చర్చించుకుంటాం. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని ముందే ఫిక్స్ అవుతాము. ఇంత పక్కాగా ఉంటాం కాబట్టే మా మధ్య ఎటువంటి గొడవలు రావు” అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా. ఇక తనని స్టార్ హీరోయిన్ ను చేసిన టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. దానికి ఆమె ‘కాలమే సమాధానం చెప్పాలి’ అంటూ దాటేసింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus