Genelia: రీఎంట్రీ గురించి మాట్లాడిన స్టార్‌ హీరోయిన్‌.. వాళ్ల మాటలు వినకుండా..!

హీరోయిన్‌లో చైల్డిష్‌ లుక్‌, ఫీల్‌ అని అనగానే మనకు గుర్తొచ్చే హీరోయినల్లలో జెనీలియా (Genelia) పేరు కచ్చితంగా మొదట్లో ఉంటుంది. ‘బొమ్మరిల్లు’ (Bommarillu) సినిమాలో ఆమె నటన ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ‘ఆరెంజ్‌’లో (Orange) కూడా అలానే అనిపిస్తుంది. అలాంటి హీరోయిన్‌ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైపోయింది. సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత ‘వేద్‌’ సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను ఇటీవల వెల్లడించింది.

Genelia

సినిమాల్లోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకు తెలిసిన వాళ్లు కూడా ప్రోత్సహించలేదని ఓ చేదు నిజం చెప్పింది జెనీలియా. అంతేకాదు ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డానని కూడా తెలిపింది. కెరీర్‌లో సక్సెస్‌, ఫెయిల్యూర్‌కు ప్రాధాన్యత ఇవ్వనని, ఎందుకంటే జయాపజయాలు మన జీవితంలో భాగమని నమ్ముతానని చెప్పింది. నటిగా ఆరు భాషల్లో పనిచేశానని, పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కొన్నేళ్లు ఆగిపోయానని తన గ్యాప్‌ కారణం చెప్పుకొచ్చింది.

అయితే కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని అనుకున్నప్పుడు పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? వర్కౌట్‌ కాదు అని నిరాశ పరిచారట. అయితే ఆమె మాత్రం ధైర్యం చేసి సినిమాల్లోకి తిరిగి వచ్చింది. రితేశ్‌తో చేసిన ‘వేద్‌’ సినిమా మంచి విజయం అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి లేదు అని జెనీలియా నిర్ణయం తీసుకుందట. అయితే గ్యాప్‌ తీసుకున్న పదేళ్ల కాలంలో తన గురించి, పిల్లలు, కుటుంబం గురించి మాత్రమే దృష్టి పెట్టానని చెప్పింది జెనీలియా.

‘తుజే మేరీ కసమ్‌’ సినిమాతో 2003లో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో ‘సై’ (Sye), ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’ (Ready) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. తన తొలి సినిమా షూటింగ్‌ సమయంలోనే నటుడు రితేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగాయి. ఆమె రీఎంట్రీ ఇచ్చిన ‘వేద్‌’ మన తెలుగు సినిమా ‘మజిలీ’కి రీమేకే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus