స్టార్ హీరోయిన్ పై ప్రశంసలు.. కారణం అదే..!

హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకుంట..! ‘బాయ్స్’ ‘సత్యం’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జెనీలియా ఆ తరువాత ‘సై’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కూడా నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన నటినతో అలరించింది ఈ బ్యూటీ. అయితే హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలతో బిజీగా ఉన్న రోజుల్లోనే బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి… వివాహం చేసుకుంది. ఆ తరువాత చాలా వరకూ సినిమాలను తగ్గిస్తూ వచ్చింది.

‘బాలీవుడ్ కు వెళ్ళింది కదా.. అక్కడి హీరోయిన్ల లానే త్వరగా ఈ బ్యూటీ విడాకులు తీసుకుంటుందేమో’ అంటూ గతంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ… మిగిలిన వారికి కూడా ఆదర్శంగా నిలుస్తుండడం విశేషం.ఇదిలా ఉంటే.. ఇటీవల జెనీలియా, రితేశ్ లు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఆర్గాన్ డొనేషన్ కు వీరు ఓకే చెప్పారని తెలుస్తుంది. ఈ విషయం పై జెనీలియా మాట్లాడుతూ.. “ఆర్గాన్ డొనేషన్ కు మేము కూడా అప్లికేషన్ ఫిల్ చెయ్యాలని డిసైడ్ అయ్యాం.

మేమిద్దరం చాలా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈరోజు ‘డాక్టర్స్ డే’ కాబట్టి మాకు గుర్తొచ్చింది. అందుకే అప్లికేషన్ ఫిల్ చేయాలనుకున్నాం. మనం ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి ఏమైనా ఉందా అంటే అది ఇదే! అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను నిలపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది”అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా. ఆమె తీసుకున్న నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు..!


మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus