అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఘాటి’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘ఘాటి’ ఫైనల్ గా సెప్టెంబర్ 5న విడుదల కానుంది అని తెలుపుతూ చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేసింది.
‘ఘాటి’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 21 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లు వేసిన వాళ్ళు ‘ఘాటి’ లు అని… ప్రస్తుతం వాళ్ళు గంజాయి మోసే గాడిదలు అని సినిమా టైటిల్ కి ట్రైలర్ ఆరంభంలోనే క్లారిటీ ఇచ్చేశారు.
అనుష్క ఘాటి గానే కాకుండా, బస్ కండక్టర్ గా, ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూసే ప్రియురాలిగా కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో హీరో, హీరోయిన్లు గంజాయి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, తర్వాత మానేయాలి అనుకున్నప్పుడు విలన్ గ్యాంగ్స్ పెట్టే ఇబ్బందులే మిగిలిన సినిమా అని తెలుస్తుంది.
అనుష్క, విక్రమ్ ప్రభు..లు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టారు అనిపిస్తుంది. దర్శకుడు క్రిష్ శైలికి భిన్నంగా రూపొందిన సినిమా ఇది అనే క్లారిటీ కూడా ‘ఘాటి’ ట్రైలర్ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.సాగర్ నాగవెల్లి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించే విధంగా అనిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా సెప్టెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ట్రైలర్ తో కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను ఓ లుక్కేయండి :