ఇప్పుడంటే పెద్ద సినిమా అనుకోగానే లేదంటే అందరూ చూడదగ్గ కథ అనగానే.. పాన్ ఇండియా అంటూ ఓ ట్యాగ్ రెడీ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఇక్కడ ఓ హీరోతో చేసిన సినిమా కథను, వేరే భాషలో వేరే హీరో చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రం ‘గజిని’. మురుగదాస్ కలం నుండి వచ్చిన అద్భుతమైన చిత్రమిది. హీరో అంటే ఇలా ఉండాలి అనే లెక్కలు పక్కన పెట్టి.. సూర్యను కొత్తగా చూపించి, ప్రేక్షకులకు కొత్త ప్రేమకథను అందించారు సూర్య, మురుగదాస్.
ఇప్పుడు ఈ సినిమా గురించి, సూర్య గురించి, మురుగదాస్ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఈ సినిమా సీక్వెల్ ఆలోచనలు టాలీవుడ్ – బాలీవుడ్ మధ్య తిరుగుతున్నాయి కాబట్టి. అదేంటి తిరగాల్సింది టాలీవుడ్, కోలీవుడ్ మధ్య కదా అనుకుంటున్నారా? మీరు అనుకున్నది కరెక్టే.. సినిమాలో హీరో సూర్య అయితే అలానే తిరిగేవి. ఇప్పుడు సీక్వెల్ సినిమాలో సూర్య కాకుండా ఆమిర్ ఖాన్‌తో చేద్దాం అనుకుంటున్నారు. అలా అని ఆమిర్‌కు ‘గజిని’ కొత్తేం కాదు కూడా. హిందీ ‘గజిని’లో నటించింది ఆయనే మరి.
సూర్య, అమీర్ ఖాన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ క్లాసిక్ సినిమా అంటే (Ghajini 2) ‘గజిని’ అనే చెప్పాలి. అంతలా వాళ్ల కెరీర్‌లో ఆ సినిమాలు ప్రభావం చూపించాయి. మురుగదాస్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు సీక్వెల్ కోసం ఇంచుమించు ఇదే ప్లాన్ చేస్తున్నారు. అంటే మురుగదాస్ డైరక్షన్‌లో ఆమిర్ ఖాన్ హీరోగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత ఎవరు అనేది చెప్పలేదు. ఇంకెవరు సేమ్ కాంబినేషన్ రిపీట్ అన్నాం కాబట్టి అల్లు అరవిందే. ఈ మేరకు ఇటీవల ఈ ముగ్గురి మధ్య చర్చ కూడా జరిగిందట.
‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా తర్వాత ఆమిర్ కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఏదో రీమేక్ సినిమా ఓకే చేశారు అని వార్తలొచ్చినా.. క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆమిర్ కొత్త సినిమా విషయంలో ఈ ప్రాజెక్ట్‌తో క్లారిటీ వచ్చింది అనొచ్చు. అయితే ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందట. ఇక సూర్య ఈ సినిమాలో ఎందుకు లేడు అని అంటే.. సీక్వెల్ విషయంలో ఆయన అంత ఆసక్తిగా లేకపోవడంతో పాన్ ఇండియా స్థాయిలో ఆమిర్‌తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. మరోవైపు షారుఖ్ ఖాన్‌కి ‘పఠాన్’లా.. ఆమిర్‌కి ఓ యాక్షన్ – మాస్ సినిమా కావాలి. అది ‘గజిని 2’ అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?