బాలీవుడ్‌లో (Bollywood) ఒకప్పుడు హిట్ల మధ్య ఫ్లాప్‌లు వెతుక్కునేవారు. ఇప్పుడు ఫ్లాప్‌ల మధ్య హిట్లను వెతుకుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు అంటే అక్కడ మ్యాగ్జిమమ్ గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు కనీసం మినిమమ్ గ్యారెంటీ కూడా లేదు. ఎంతగా లేదు అంటే పెద్ద హీరో సినిమా వచ్చే కన్నా.. ఓ చిన్న సినిమా వచ్చి పెద్ద హిట్ కొడితే చాలు అని అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ఇప్పుడు మరో మాట యాడ్ అయ్యింది. అదే దెయ్యం సినిమాలు.
Bollywood
దీనికి రెండ పెద్ద కారణాలు చెబుతున్నారు బాలీవుడ్ జనాలు. ఈ ఏడాది వచ్చిన రెండు దెయ్యాల సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ‘స్త్రీ 2’ (Stree 2) అనే చిన్న సినిమా వచ్చింది. ఏదో వచ్చింది, కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతుంది అని అనుకున్న ఆ సినిమా.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.880 కోట్ల వసూళ్లు అందుకుంది. దీంతో ఆశ్చర్యం కాదు.. అంతకుమించిన ఫీలింగ్ ప్రేక్షకుల వంతు అయింది.
‘స్త్రీ 2’, ‘భూల్ భులయ్యా 3’ మధ్య కామన్ పాయింట్ హారర్ ఎలిమెంట్. దీంతో స్టార్ల కంటే బాలీవుడ్‌లో దెయ్యాలే మేలు అని నవ్వుకుంటున్నారు. కిచిడీలు, రీమేక్‌లు నమ్ముకుని సినిమాలు చేస్తున్న స్టార్లు.. ఇప్పటికైనా మేలుకుంటారేమో చూడాలి. ఎందుకంటే నేటివిటీ, కొత్తదనానికే బాలీవుడ్ (Bollywood) జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.