విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘అవా ఎంటర్‌టైన్‌మెంట్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈషాన్ సూర్య ‘జిన్నా’ కి దర్శకత్వం వహించాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే మాత్రం కోన వెంకట్ అందించడం జరిగింది.పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్.. హీరోయిన్స్ . దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘జిన్నా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం నిరాశపరిచాయి.పోనీ రెండో రోజు నుండి పికప్ అవుతుందా అనుకుంటే అలాంటిదేమి జరగడం లేదు.ఆదివారం, అలాగే దీపావళి రోజున ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.15 cr
సీడెడ్
0.10 cr
ఆంధ్ర(టోటల్)
0.17 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
0.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్ + మిగిలిన వెర్షన్లు
0.11 cr
వరల్డ్ వైడ్ టోటల్
0.53 cr
‘జిన్నా’ చిత్రానికి రూ.4.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ కేవలం రూ.0.53 కోట్ల షేర్ ను రాబట్టింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో రూ.4.07 కోట్ల షేర్ ను రాబట్టాలి. మంచి టాక్ వచ్చినా ఈ మూవీకి కలిసి రావడం లేదు. ఇక ఈ మూవీ రన్ దాదాపు ముగిసినట్టే అనుకోవాలి.